బోగస్ రేషన్‌కార్డుల ఏరివేత, అర్హులకు మాత్రమే రేషన్ అందేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ కేవైసీ తప్పనిసరి చేసింది. ఇప్పటికే రెండు సార్లు గడువు తేదీని పొడిగించిన ప్రభుత్వం మరోసారి పొడిగించకపోవచ్చని తెలుస్తోంది. 74 శాతం మంది ఇప్పటివరకూ ఈ కేవైసీ పూర్తి చేసుకున్నారు. మిగిలిన వారు వీలైనంత త్వరగా సమీప రేషన్ దుకాణాలు లేదా మీసేవల్లో ఈకేవైసీ పూర్తి చేసుకొని రేషన్ కార్డు కొనసాగేలా చూసుకోవాలని అధికారులు సూచించారు.