Ration Cards : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త రేషన్‌కార్డుల (Ration Cards) జారీపై బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ ఏడాది మే నెల నుంచి ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఏప్రిల్ 30న KYC ప్రక్రియ పూర్తయిన వెంటనే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని ఆయన అన్నారు. కొత్త కార్డులు జారీ చేసే సమయంలో కుటుంబ సభ్యులను జోడించడం, తొలగించడం మరియు కార్డులను విభజించడం వంటి ఎంపికలు ఇస్తామని ఆయన అన్నారు. QR కోడ్ వంటి భద్రతా లక్షణాలతో కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.