HomeతెలంగాణRation Cards: రేషన్‌కార్డుల సవరణకు అష్టకష్టాలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!

Ration Cards: రేషన్‌కార్డుల సవరణకు అష్టకష్టాలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!

Ration Cards: రేషన్‌కార్డు సవరణ ప్రక్రియ రాష్ట్రంలో పౌరులకు అష్టకష్టాలుగా మారింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో వాలంటీర్ల ద్వారా జరిగిన హౌస్‌హోల్డ్‌ మ్యాపింగ్‌ అస్తవ్యస్తంగా ఉండటంతో సమస్యలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ స్పందించి, వివాహ మైగ్రేషన్‌ ద్వారా సవరణ ప్రక్రియను సులభతరం చేసేందుకు చర్యలు తీసుకున్నారు.అయితే, ఈ సౌలభ్యం గురించి తెలియక సచివాలయ అధికారులు కొందరు రేషన్‌కార్డు సవరణకు వివాహ ధ్రువపత్రం తేవాలని డిమాండ్‌ చేస్తూ గందరగోళం సృష్టిస్తున్నారు. దీనికి తోడు, సర్వర్‌ సమస్యలు మరింత ఇబ్బందులకు కారణమవుతున్నాయి.

ఆన్‌లైన్‌ సేవల్లో సర్వర్‌ మొరాయింపు వల్ల అర్జీల ప్రక్రియ ఆలస్యమవుతోంది, దీంతో పౌరులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
మంత్రి నాదెండ్ల మనోహర్‌ సూచనలతో సవరణ ప్రక్రియను సరళీకరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, సచివాలయ స్థాయిలో సమాచార లోపం, సాంకేతిక ఇబ్బందులు సమస్యలను మరింత జటిలం చేస్తున్నాయి. ఈ అవాంతరాలను తొలగించి, పౌరులకు సులభంగా సేవలు అందించేందుకు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని పౌరులు కోరుతున్నారు.

Recent

- Advertisment -spot_img