Ration Cards : రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల (Ration Cards) జారీపై లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. కొత్త రేషన్ కార్డుల జారీలో భాగంగా అర్హుల జాబితాలో పేర్లు లేని వారికి మరోసారి అవకాశం కల్పించిన ప్రభుత్వం మళ్లీ గ్రామసభల్లో దరఖాస్తు చేసుకోవాలని కోరింది. దాంతో వారు మళ్ళీ కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇంతలో, మీసేవా కేంద్రాలలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణపై రాష్ట్రంలో గందరగోళం నెలకొంది. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు కోరినప్పటికీ, ఎన్నికల కోడ్ కారణంగా ఆ ప్రక్రియ ఆగిపోయిందనే ప్రచారం జరుగుతోంది. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదని పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. రేషన్‌కార్డుల్లో పేర్లు మార్పు, చేర్పు ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు.