Ration cards : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు మంత్రి నారా లోకేశ్ ప్రారంభించిన విషయం తెల్సిందే. ఈ క్రమంలో మొత్తం 161 రకాల పౌరసేవలు అందించనున్నారు. WhatsApp గవర్నెన్స్‌లో భాగంగా, ప్రభుత్వ అధికారిక WhatsApp నంబర్ 95523 00009 ప్రకటించింది. దీని ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు అర్హత వంటి సమాచారాన్ని ఈ సేవల ద్వారా తెలుసుకోవచ్చు. రెవెన్యూ శాఖకు సంబంధించిన భూ రికార్డులు, వివిధ ధ్రువపత్రాలు వాట్సాప్ ద్వారా పొందవచ్చు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ద్వారానే కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నారు. ఐటీ మంత్రి నారా లోకేష్ వాట్సాప్ ద్వారా కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. డిజిటల్ రేషన్ కార్డులను (Ration cards) క్యూఆర్ కోడ్ ద్వారా జారీ చేస్తామని ఆయన వెల్లడించారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని ఆయన అన్నారు. ఈ కసరత్తును 45 రోజుల్లో పూర్తి చేయాలని పేర్కొన్నారు.