బెంగళూరు రేవ్ పార్టీ వివాదంలో తన పేరు రాకపోవడంతో చాలామంది నిరుత్సాహపడి ఉంటారని నటుడు నవదీప్ అన్నారు. నవదీప్ కొత్త సినిమా ‘లవ్ మౌళి’ పబ్లిసిటీ కోసం జరిగిన ప్రెస్‌మీట్‌లో రేవ్ పార్టీ గురించి ప్రశ్న ఎదురవగా ఆయన స్పందించారు. ఈసారి సంచలన రేవ్ పార్టీ వివాదంలో తనపై రూమర్స్ రాకపోవడం వల్ల మంచే జరిగిందని, ఈ ఒక్కసారి వదిలేశారని నవ్వుతూ సమాధానాలిచ్చారు. ఈ సారి తనకు మంచి జరిగిందని, ఈసారి మీడియా తనను వదిలేసిందని అన్నారు. అలాగే రేవు పార్టీ అనే పదానికి నవదీప్ కొత్త అర్థం కూడా చెప్పాడు. రాత్రి, పగులు జరిగే పార్టీని రేవు పార్టీ అంటారు అంటూ తనదైన శైలిలో నవదీప్ తెలిపాడు. నవదీప్ ‘లవ్ మౌళి’ సినిమా జూన్ 7న విడుదల కానుంది.