Homeహైదరాబాద్latest NewsRave Party: హేమ రేవ్ పార్టీ పై 'మా' ప్రెసిడెంట్ అలా అనేశాడేంటి..?

Rave Party: హేమ రేవ్ పార్టీ పై ‘మా’ ప్రెసిడెంట్ అలా అనేశాడేంటి..?

సినీ నటి హేమ బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో హేమ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిందని బెంగళూరు పోలీసు ఉన్నతాధికారులు అధికారికంగా వెల్లడించారు. డ్రగ్స్ సహా రేవ్ పార్టీ ఆరోపణల్ని హేమ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ‘అబ్బే దానికీ సంబంధం లేదు’ అంటూ బుకాయించే ప్రయత్నించడం హేమకు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టిన సంగతి తెలిసిందే. బెంగళూరు పోలీసులు రేవ్ పార్టీలో పాల్గొన్న వారికి పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించి, ఎప్పుడు పిలిచినా విచారణకు రావాలని నోటీసులు పంపారు. అయిన ఎప్పటికి హేమ బుకాయింపులు ఇంకా కొనసాగుతూనే వచ్చాయి.
అయితే బెంగుళూరు పోలీసులు హేమ కు విచారణకు హాజరుకావాలని నోటీసు జారీ చేస్తే.. ఆరోగ్య సమస్యల కారణంగా విచారణకు హాజరు కాలేనని బదులిచ్చింది. అది కుదరదని, విచారణకు రావాల్సిందేనని బెంగళూరు పోలీసులు హేమకు మరోసారి అల్టిమేటం జారీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సినీ నటుడు, నిర్మాత మంచు విష్ణు ‘మా’ అసోసియేషన్ తరపున నటి హేమకు అండగా నిలిచారు. హేమపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. నిజానిజాలు తెలిసే వరకు హేమాని ఎవరూ టార్గెట్ చేస్తూ దుష్ప్రచారం చేయవద్దని ‘మా’ మంచు విష్ణు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
అయితే హేమ బెంగుళూరు రేవ్ పార్టీ వ్యవహారంలో చిక్కుకుంటే, ఆమె తరపున మంచు విష్ణు ష్ణు వకాల్తా పుచ్చుకోవడమేంటి.? మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ అధ్యక్షురాలిగా హేమ తరుపున విష్ణు స్పందిస్తారనుకుంటే అది కాస్త సమంజసమే. కానీ, అందరి విషయంలోనూ ఇలాగే స్పందించడు కదా? అదే అసలు సమస్య అని కొందరు అని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆ సమయంలో మంచు విష్ణు ఇలా స్పందించాలేదే. సహజంగానే విష్ణు-హేమ వ్యవహారంపై సినీ ఇండస్ట్రీలో, సినీ ప్రేక్షకుల్లో, సామాన్య ప్రజల్లో రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Recent

- Advertisment -spot_img