Homeహైదరాబాద్latest NewsRave Party: రేవ్ పార్టీ అంటే ఏమిటి?.. డాన్సులు మాత్రమే కాదు ..శృంగారం కూడా..!

Rave Party: రేవ్ పార్టీ అంటే ఏమిటి?.. డాన్సులు మాత్రమే కాదు ..శృంగారం కూడా..!

తాజాగా సంచలనం రేపుతున్న రేవ్ పార్టీ అంటే ఏమిటి?.. అక్కడ ఏం చేస్తారు? సెలబ్రిటీలకు రేవు పార్టీ అంటే ఎందుకు అంత ఇష్టమో ఇప్పుడు తెలుసుకుందాం.. పార్టీలు చేసుకోవడం సహజం. చాలా మంది బర్త్ డే పార్టీ అని, సక్సెస్ పార్టీ ఇలా ఎన్నో పార్టీలు చేసుకుంటారు. తమ స్నేహితులతో కలిసి ఈ పార్టీలు చేసుకుంటారు. అయితే ఇందులో రేవ్ పార్టీ కూడా ఒకటి. కానీ ఇది ఇతర పార్టీలకంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఇదో మాయాలోకం అని చెప్పవచ్చు. ఇందులో ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్ (EDM) తో నిండి ఉంటుంది. ఇది మీరు ఊహించని ఓట్రాన్స్ లోకి మిమ్మల్ని తీసుకపోతుందంట. దాంతో మీరు ఏం చేస్తున్నారో కూడా మీకు తెలియదంట. నచ్చినట్లు డ్యాన్స్ చేయడం, ఇతరులతో కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకే రిథమ్ తో డీజేలు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే అది వేరే అనుభవం అంటున్నారు.

ఈ పార్టీలో ఇదే చేయాలి అని ఏం ఉండదంట. అన్నీ చేయోచ్చు..ఇతరులతో క్లోజ్‌గా కూడా మూవ్ అవ్వొచ్చునంట. ఆ ట్రాన్స్‌నే మిమ్ముల్ని ఆలోకంలోకి తీసుకెళ్తుంది. అయితే ఈ రేవ్ పార్టీ కల్చర్ అనేది ఇప్పుడే వచ్చిందని చాలా మంది అనుకుంటారు. కానీ ఇది మొదట 1980లో చికాగోలో ప్రారంభమైంది. కానీ అప్పుడు వారు ఇలా రాత్రి వేళల్లో కాకుండా, మార్నింగ్ టైమ్ లో డీజేలు పెట్టుకొని, కొత్తగా బీట్స్ వేస్తూ ఎంజాయ్ చేసేవారంట. ఇంతకు ముందు ఎప్పుడూ వినని మ్యూజిక్ దానిలో ఉండేది. ఇక కల్చర్ తర్వాత యూకేకు చేరుకుంది. దీంతో అక్కడ రేవ్ పార్టీ రూపాన్ని మొత్తం మార్చేశారని చెప్పవచ్చు. రాత్రిళ్లు ఈ పార్టీ చేసుకోవడం, మాదక ద్రవ్యాలు వాడుతూ ఎంజాయ్ చేయడం మొదలు పెట్టారు.

ఈ రేవ్ పార్టీలో చాలా వరకు డ్యాన్స్‌లు , పబ్ కల్చర్ ఉంటుందనుకుంటారు. కానీ ఇందులో అంతకు మించి తమకు నచ్చిన విధంగా గడిపే స్వేచ్ఛ ఉంటుందంట. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా వారికి నచ్చినట్లు వారు ఎంజాయ్ చేయోచ్చు. అంతే కాకుండా ఈ పార్టీ అంటే ఉత్సాహాన్నీ పెంచే ఓ మాయలోకం అంట. ఇంద్రియాలకు ఈ పార్టీలు విందునిస్తాయనే చెప్పవచ్చు. తెలియకుండానే మీలో ఎనర్జీ, ఉల్లాసం పెరుగుతుంది, స్వేచ్చగా గడుప వచ్చునంట.

Recent

- Advertisment -spot_img