మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల రిలీజైన టైగర్ నాగేశ్వరరావు సినిమా డిజాస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే, ‘ఈగల్’మూవీతో సక్రాంతి బరిలో నిలిచారు రవితేజ. లేటెస్ బజ్ ప్రకారం.. ఇటీవల భగవంత్ కేసరితో మరో విజయాన్ని అందుకున్న సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో రవితేజ మరో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. 2017లో వీరి కాంబోలో వచ్చిన ‘రాజా ది గ్రేట్’ఎంత పెద్ద హిట్టయ్యిందో అందరికీ తెలిసిందే. మరోసారి వీరి కాంబోలో సినిమా రానున్నట్లు టాక్. ‘రాజా ది గ్రేట్’ను నిర్మించిన దిల్ రాజు ఈ మూవీకి ప్రొడ్యూసర్ అని సమాచారం. రవితేజ, అనిల్ రావిపూడి సినిమా వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలున్నాయి. దీనిపై అఫిషియల్ ప్రకటన రావాల్సి ఉంది. అయితే, రాజా ది గ్రేట్‌కు సీక్వెల్ కూడా కావొచ్చనే బజ్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది.