హీరో రవితేజ- డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. ఈ సినిమా విడుదల తేదీ ఆదివారం ఖరారైంది. ఆగస్టు 15న విడుదల కానుంది. ప్రీమియర్స్ ఆగస్టు 14న ప్రదర్శించనున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందం పోస్ట్ పెట్టింది.