Homeజిల్లా వార్తలుఉపాధ్యాయులను ఘనంగా సన్మానించిన రవీందర్ యాదవ్

ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించిన రవీందర్ యాదవ్

ఇదేనిజం, శేరిలింగంపల్లి: గురువు లేకపోతే జీవితంలో ఎవరూ సక్సెస్ కాలేరని, ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో రూపంలో గురువు ఉంటారని భారాస సీనియర్ నేత రవీందర్ యాదవ్ అన్నారు. గురువు ఆశీర్వాదంతోనే జీవితానికి సన్మార్గం దొరుకుతుందని వెల్లడించారు. విజయవంతమైన జీవితానికి గురువే  పునాదిగా నిలుస్తారని కొనియాడారు. టీచర్స్ డే సందర్భంగా గురువారం మియాపూర్ ప్రభుత్వ పాఠశాలలోని ఉపాధ్యాయులకు సన్మానం చేశారు. ఎనిమిది మంది టీచర్స్ ను ఘనంగా సత్కరించి టీచర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రవీందర్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరి జీవితంలో ఉపాధ్యాయులది ప్రత్యేక పాత్ర అన్నారు. జీవితంలో మొదటి గురువు తల్లి.. అక్కడి నుంచి పాఠశాలలో విద్య నేర్పిన ప్రతి గురువు మన జీవితంలో ఎదుగుదలకు కారకులు అవుతారన్నారు. మనకు జ్ఞానాన్ని బోధించి, ముందుకు సాగడానికి సన్మార్గ బోధన చేసేది గురువు మాత్రమేనని వెల్లడించారు.

Recent

- Advertisment -spot_img