Ravindra Jadeja : నేడు నాగ్‌పూర్‌లో టీమిండియా , ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ 248 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ఆల్‌టైమ్ రికార్డు నమోదు చేసాడు. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించాడు. ఈ వన్డేల్లో అండర్సన్ 40 వికెట్లు తీయగా.. తాజా మ్యాచ్ లో జడేజా మూడు వికెట్లతో 42 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో జడేజా మూడు వికెట్లు తీసి అంతర్జాతీయ క్రికెట్‌లో 600 వికెట్ల తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఈ ఘనత సాధించిన ఐదో భారత బౌలర్‌గా నిలిచాడు. అలాగే అంతర్జాతీయ క్రికెట్‌లో 600 వికెట్లు తీసి, 6000 పరుగులు చేసిన ఏకైక భారత స్పిన్నర్‌గా జడేజా నిలిచాడు.