Homeఫ్లాష్ ఫ్లాష్RBI:ఆర్బీఐ కీలక నిర్ణయం

RBI:ఆర్బీఐ కీలక నిర్ణయం

RBI:వడ్డీ రేట్ల పెంపు విషయంలో ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే ఈసారి కూడా కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్షలో తీసుకున్న నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ గురువారం ప్రకటించారు. రెపో రేటును 6.50 శాతం వద్ద అలాగే కొనసాగుతుందని తెలిపారు. ఎస్‌డీఎఫ్‌ రేటు 6.25 శాతం, ఎంఎస్‌ఎఫ్‌ రేటు 6.75 శాతం, బ్యాంక్‌ రేటు 6.75 శాతం వద్ద స్థిరంగా ఉంటాయని వెల్లడించారు.గత ఏప్రిల్‌లో జరిగిన తొలి ద్రవ్యపరపతి విధాన సమీక్షలో కూడా వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే అంతకుముందు మాత్రం ద్రవ్యోల్బణాన్ని నియంత్రించాలనే కారణంతో 2022 మే నుంచి వరుసగా ఆరు సార్లు రెపో రేటును పెంచేసింది. ఆరు విడతల్లో 250 బేసిస్‌ పాయింట్లు పెంచి రుణ గ్రహీతలపై భారం పెంచింది. కానీ ఈసారి మాత్రం వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడంతో వారికి ఉపశమనం కలిగినట్లయ్యింది.

Recent

- Advertisment -spot_img