ఆర్బీఐ బ్యాంక్ న్యూ ఇయర్ సందర్భంగా రైతులకు భారీ కానుకను అందించింది. రిజర్వ్ బ్యాంక్ ఎలాంటి హామీ లేకుండా రైతులకు రుణ పరిమితిని రూ.2 లక్షలకు పెంచింది. గతంలో ఈ పరిమితి రూ.1.60 లక్షలుగా ఉండేది. అలాగే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్త సంవత్సరంలో UPI 123Pay పరిమితిని పెంచింది. ఇప్పటి వరకు ఈ పేమెంట్ సర్వీస్ ద్వారా గరిష్టంగా 5 వేల రూపాయల వరకు లావాదేవీలు జరిగేవి. కొత్త సంవత్సరంలో దీని పరిమితిని 10 వేల రూపాయలకు పెంచారు.వంట గ్యాస్ (LPG) ధర ప్రతి నెల 1వ తేదీన సవరించబడుతుంది. 1 జనవరి 2025 నుండి చమురు కంపెనీలు ఎల్‌పిజి ధరలలో ఏమైనా మార్పులు చేస్తాయో లేదో చూడాలి.