UPI (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) పేమెంట్ల విధానంలో RBI (రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా) మరోసారి కీలక మార్పులు చేపట్టింది. డిజిటల్ పేమెంట్లను మరింత ప్రోత్సహించేలా సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్ (PPI)లను అందిస్తున్న సంస్థల వాలెట్లలోని డబ్బులను ఇకపై థర్డ్ పార్టీ మొబైల్ అప్లికేషన్ల ద్వారానూ పేమెంట్లు (డబ్బులు పంపడం, రిసీవ్ చేసుకోవడం) చేసుకునే సేవలు అందుబాటులోకి తెచ్చింది. అంటే ఇకపై ఏ యూపీఐ యాప్ ద్వారానైనా వాలెట్ నుంచి పేమెంట్ చేయొచ్చు. పూర్తి కేవైసీ చేసిన పీపీఐ యూజర్ ఇకపై థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా చెల్లింపులు చేయవచ్చని తెలిపింది.