వడ్డీ రేట్ల విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. రెపో రేట్లకు సంబంధించి మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. వడ్డీ రేట్లు 6.5శాతంగానే కొనసాగనున్నట్లు ప్రకటించింది. కాగా గత ఆరు మానిటరీ పాలసీ కమిటీ సమావేశాల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పూ చేయకుండా 6.5శాతాన్నే కొనసాగిస్తూ వస్తోంది. కొత్త ఆర్థిక సంవత్సరంలో (2024-25) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కి ఇదే తొలి ప్రకటన.