RBI : దేశంలోకి త్వరలో కొత్త రూ.50 నోట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు ఆర్‌బిఐ కీలక ప్రకటన చేసింది. గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో కూడిన కొత్త రూ.50 నోట్లను త్వరలో విడుదల చేయనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బుధవారం తెలిపింది. ఈ కొత్త నోట్లు మహాత్మా గాంధీ చిత్రపటాన్ని కలిగి ఉన్న నోట్ల శ్రేణిని పోలి ఉంటాయి. పాత నోట్లకు వర్తించే నిబంధనలు వీటికి కూడా వర్తిస్తాయని తెలిపింది.