Homeహైదరాబాద్latest NewsRCB : దంచికొట్టిన ఆర్సీబీ బ్యాటర్లు.. రాజస్థాన్‌పై ఘన విజయం

RCB : దంచికొట్టిన ఆర్సీబీ బ్యాటర్లు.. రాజస్థాన్‌పై ఘన విజయం

RCB : ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా నేడు జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్లు మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసి రాజస్థాన్ నిర్ణత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. అయితే 174 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆర్సీబీ నిర్ణత 17.3 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 175 పరుగులు చేసి రాజస్థాన్‌పై ఘన విజయం సాధించింది. ఆర్సీబీ బ్యాటర్లు ఫిలిప్ సాల్ట్ 65 పరుగులు, విరాట్ కోహ్లీ 62, దేవదత్ పడిక్కల్ 40 పరుగులు చేసారు.

Recent

- Advertisment -spot_img