ఫ్యాన్‌బేస్ పరంగా భారీ ఆదరణ కలిగిన RCBని గతేడాది ఫాఫ్ డుప్లెసిస్ నడిపించాడు. అతడిని రిటైన్ చేసుకోకపోవడంతోపాటు మెగా వేలంలోనూ RCB తీసుకోలేదు. దీంతో విరాట్ కోహ్లీ మరోసారి ఆ జట్టు బాధ్యతలను చేపట్టాలని అభిమానుల నుంచి డిమాండ్లూ వస్తున్నాయి. ఈక్రమంలో ఆర్సీబీ మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీనే RCB జట్టు పగ్గాలను తీసుకుంటాడని వ్యాఖ్యానించాడు.