Homeస్పోర్ట్స్విరాట్​, ఏబీ ఈసారైనా ఆర్సీబీకి ట్రోఫీ అందిస్తరా

విరాట్​, ఏబీ ఈసారైనా ఆర్సీబీకి ట్రోఫీ అందిస్తరా

దుబాయి: క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2020కి రంగం సిద్ధమవుతోంది. సెప్టెంబర్‌ 19 నుంచి యూఏఈ వేదికగా లీగ్ ప్రారంభం కానుంది. ఆర్సీబీ స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌ఇద్దరూ ప్రాక్టీస్‌ చేయడంతో అభిమానులు సంబరపడుతున్నారు. ఈ సారైనా వీరిద్దరూ ఆర్సీబీకి టైటిల్‌ సాధించి పెడతారని అభిమానులు ఆశిస్తున్నారు. వీరిద్దరికి సంబంధించిన నెట్​ ప్రాక్టిస్​ వీడియోను రాయల్​ ఛాలెంజర్స్ బెంగుళూరు(ఆర్సీబీ) ట్విట్​ చేసింది. దాదాపు ఐదు నెలల తర్వాత ఆదివారం మైదానంలోకి అడుగుపెట్టిన దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌‌ ఏబీ డివిలియర్స్ మునుపటిలా తన షాట్లతో అలరించాడు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మాట్లాడుతూ… ఐదు నెలల తర్వాత బ్యాట్‌ పట్టడంతో తొలుత తాను కాస్త భయపడినట్లు చెప్పాడు. అయితే తాము ఊహించినదాని కంటే తర్వాత ప్రాక్టీస్‌ బాగా జరిగిందని వెల్లడించాడు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img