RCB vs DC : ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా నేడు ఎం. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ ఫీల్డింగ్ ఎందుకుంది. ఈ క్రమంలో మొదట బ్యాటింగ్ బెంగళూరు చేయనుంది. బెంగళూరు 4 మ్యాచ్‌ల్లో 3 గెలిచి ఫామ్‌లో ఉండగా, ఢిల్లీ మూడు మ్యాచ్‌లు ఆడి అవ్వని గెలిచి టాప్‌లో ఉంది. మరి ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారా అన్న ఆసక్తి నెలకొంది.
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఫాఫ్ డు ప్లెసిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, మోహిత్ శర్మ ఉన్నారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో విరాట్ కోహ్లి, ఫిలిప్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, యశ్ దయాల్ ఉన్నారు.