RCB vs PBKS : ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా నేడు బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో పంజాబ్ కింగ్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ వర్షం కారణంగా మ్యాచ్ ని ప్రస్తుతం నిలిపివేశారు. చిన్నస్వామి స్టేడియం బురదమయంగా మారడంతో టాస్ ఇంకా నిర్వహించలేదు. వర్షం ఇంకా ఆగకపోవడంతో టాస్ మరింత ఆలస్యం కానుంది.ఈ క్రమంలో వర్షం కారణంగా మ్యాచ్ రద్దైతే ఇరు జట్లకు ఒక్కో పాయింట్‌ను అందజేస్తారు. అయితే ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు ఆడి నాలుగింటిలో విజయం సాధించిన ఇరుజట్లు ఈరోజు సమరంలో తలపడనున్నాయి. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో బెంగళూరు జట్టు మూడో స్థానంలో, పంజాబ్ నాలుగో స్థానంలో ఉన్నాయి.