రెబర్ స్టార్ ప్రభాస్ తన మంచి మనసును చాటుకున్నారు. కేరళలోని వయనాడ్‌లో చోటు చేసుకున్న ప్రకృతి విపత్తుపై ఆయన స్పందించారు. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఆయన భారీ విరాళం ప్రకటించారు. రూ.2 కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు ఆయన టీమ్ తెలిపింది. ఇప్పటికే అనేక మంది సినీ ప్రముఖులు తమ విరాళాలను ప్రకటించారు.