Homeజిల్లా వార్తలుబెస్ట్ సర్వీస్ సొసైటీ జాతీయ అవార్డును అందుకున్నమెరుగు పెద్దయ్య

బెస్ట్ సర్వీస్ సొసైటీ జాతీయ అవార్డును అందుకున్నమెరుగు పెద్దయ్య

ఇదే నిజం, దేవరకొండ: నేరేడుగొమ్ము మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన మెరుగు పెద్దయ్య యాదవ్ గత 30 సంవత్సరాలుగా ఆర్.ఎం.పి గా ఉండి పేద ప్రజలకు వైద్య సేవలు, బాలల హక్కుల పై పోరాటం మరియు ఐ ఎన్ టి యు సి జిల్లా అధ్యక్షుడిగా జిల్లా వ్యాప్తంగా కార్మికుల సమస్యలపై పోరాటం చేసినందుకుగాను గుర్తించి అనేక రకమైన సామాజిక సేవలు చేసినందుగాను గుర్తించి జూన్ 25 వ తేదీన హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి బహుజన వెస్టర్న్ రైటర్స్ ఏడవ రాష్ట్రస్థాయి సమావేశం సందర్భంగా బహుజన సాహిత్య అకాడమీ వారు అందించే అవార్డులలో భాగంగా జాతీయ చైర్మన్ నల్ల రాధాకృష్ణ గారి చేతుల మీద అందుకున్నారు. అవార్డును సెలక్షన్ చేసిన రాష్ట్ర సెలెక్టెడ్ కమిటీ మెంబెర్ సామాజికవేత్త డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ కు కృతజ్ఞతలు తెలిపారు. బహుజన అకాడమీ వారికి కృతజ్ఞతలు తెలిపారు. నేను మరింత ఉత్సాహంతో సామాజిక ఉద్యమాలలో పాల్గొని ప్రజలకు చేరువై అన్ని వర్గాలను కలుపుకొని పోయి సేవ చేస్తానని తెలిపారు. ఈ సమావేశానికి వివిధ రాష్ట్రాల నుంచి 200 మంది డెలిగేట్స్ హాజరయ్యారు.

Recent

- Advertisment -spot_img