Homeహైదరాబాద్latest Newsఆర్బీఐ హెచ్చరిక : ఒకే నంబర్‌..రెండు బ్యాంకులకు కుదరదు

ఆర్బీఐ హెచ్చరిక : ఒకే నంబర్‌..రెండు బ్యాంకులకు కుదరదు

దేశ అభివృద్ధిలో బ్యాంకుల పాత్ర ఎంతో కీలకం. పరపతిని సృష్టించి దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. అయితే బ్యాంకు ఖాతాలు తెరిచేముందు చాలావరకు కేవైసీ ఫాంలో మొబైల్ నంబర్ ఫిల్ చేస్తుంటారు. ఈ నంబర్ ఒకే బ్యాంకు అకౌంట్‌కు కాకుండా అనేక బ్యాంకులకు అనుసంధానిస్తారు. అయితే ఇకనుంచి అలా కుదరదని ఆర్బీఐ చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ పేమెంట్స్‌లో వస్తోన్న మార్పులకు అనుగుణంగా కొన్ని ఛేంజెస్ చేస్తోంది. అందులో భాగంగానే ఒక మొబైల్ నంబర్ ఒకే బ్యాంకు అకౌంట్‌కు ఇవ్వాల్సిందిగా ఆర్బీఐ ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించి మార్గదర్శకాలను బ్యాంకులకు విడుదల చేస్తోంది.

RBI : ఒకే నెంబర్ లింక్ చేశారా…

అయితే ఈ రోజుల్లో బ్యాంకు ఖాతాను ఆధార్ కార్డు మరియు మొబైల్ నెంబర్ తో రిజిస్టర్ చేయడం తప్పనిసరి. ఇదే సమయంలో ఎక్కువ ఖాతాలు కలిగి ఉన్న వారు కూడా ఒకే మొబైల్ నెంబర్ ను అన్నిచోట్ల నమోదు చేస్తున్నారు. అయితే ఇకపై అలా కుదరదని ఆర్బిఐ స్పష్టం చేస్తుంది.అయితే మీరు కొత్తగా బ్యాంకు ఖాతాను తెరిచినప్పుడు కచ్చితంగా KYC ఫారమ్ ను పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనికోసం ఆర్.బి.ఐ కేవైసీ యొక్క ప్రమాణాలు నియమాలను కూడా మార్చడం జరిగింది. ఈ క్రమంలోనే ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు కలిగి ఉండి ఒకే నెంబర్ కు లింక్ చేసిన ఖాతాదారులకు కేవైసీ చేయించుకోమని అప్డేట్ చేయవచ్చు. ఉమ్మడి ఖాతాలు కలిగి ఉన్నట్లయితే మరో మొబైల్ నెంబర్ ను కేవైసీ ఫారమ్ లో అప్డేట్ చేయాల్సి ఉంటుంది.

RBI కేవైసీ తప్పనిసరి…

ఈ రోజుల్లో బ్యాంక్ ఖాతా తెరవాలి అంటే కచ్చితంగా కేవైసీ అవసరం అవుతుంది. ఎందుకంటే ఒక వ్యక్తి బ్యాంకు ఖాతాను తెరిచినప్పుడు అతను ఇచ్చిన సమాచారం సరైనదే అని తెలుసుకోవడానికి కేవైసీ తప్పనిసరిగా చేపించాలి. అందుకే కొత్తగా ఖాతాలను తీసుకునేవారు తప్పనిసరిగా కేవైసీ చేయించుకోవాలని బ్యాంకులు వినియోగదారులకు తెలియజేస్తున్నాయి.

.

Recent

- Advertisment -spot_img