Homeహైదరాబాద్latest Newsచరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో పంట దిగుబడి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక...

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో పంట దిగుబడి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

మహబూబ్‌నగర్‌లో ‘రైతుపండుగ’ ముగింపు వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోయినా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో పంట 1.53 లక్షల మెట్రిక్ టన్నుల పంట దిగుబడి వచ్చింది అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు, వర్షాల కారణంగా.. కాళేశ్వరం నుండి చుక్క నీరు ఇవ్వకపోయినా.. 75 సంవత్సరాలలో ఏ రాష్ట్రం ఉత్పత్తి చేయనంత వడ్ల దిగుబడి వచ్చింది అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో వరిధాన్యాన్ని పకడ్బందీగా కొనుగోలు చేస్తున్నాం అని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన రూ. 7 వేల కోట్ల రైతు భరోసాను ఈ ప్రభుత్వమే ఇచ్చింది అని సీన్ రేవంత్ రెడ్డి అన్నారు.

Recent

- Advertisment -spot_img