తెలంగాణలో రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో 43 నుంచి 47 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న జగిత్యాల జిల్లా వెల్గటూరులో 47.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాదిలో రాష్ట్రంలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత. పలు ప్రాంతాల్లో 46కు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. నేడు నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది.