తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. నిన్న 8 జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్గొండ జిల్లా ఇబ్రహీంపేటలో అత్యధికంగా 46.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిన్న వడదెబ్బకు నలుగురు చనిపోయారు. మెదక్ జిల్లాలో కుమ్మరి సాకయ్య, ఆసిఫాబాద్‌లో పొర్టేటి శ్రీనివాస్, కరీంనగర్‌లో గజ్జెల సంజీవ్, హనుమకొండలో అల్లె గోవర్ధన్ వడదెబ్బకు గురై మృతి చెందారు. అయితే రాబోయే రెండు, మూడు రోజుల్లో విపరీతమైన ఎండలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. అన్ని జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నేడు రాష్ట్రంలోని 13 జిల్లాలకు, వచ్చే రెండు రోజుల్లో 18 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాల్లో తీవ్ర వడగాలుల ప్రభావం ఉంటుందని అధికారులు వెల్లడించారు.