Redmi 14C 5G ఫోన్‌ను భారత్ మార్కెట్లోకి 2025 జనవరి 6న రానుంది. ఈ ఫోన్‌లో ఏఐ బ్యాక్డ్ 50-మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా సెన్సర్‌తో పాటు డ్యుయల్ రేర్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్ ఉన్నాయి. ఈ ఫోన్ బ్లాక్, బ్లూ, పర్పుల్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. సెక్యూరిటీ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సర్ అమర్చింది. 6.88 అంగుళాల ఎల్‌సీడీ ప్యానెల్ విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తో పాటు క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్ తో వస్తుంది.