పా.రంజిత్ దర్శకత్వంలో చియాన్ విక్రమ్ హీరోగా నటించిన సినిమా ‘తంగలాన్’. ఈ సినిమా ఆగస్ట్ 15న తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజైంది. అయితే ప్రస్తుతం ఈ సినిమా ఓటిటి విడుదల తేదీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న విక్రమ్ అభిమానులకు ‘నెట్‌ఫ్లిక్స్’ షాక్ ఇవ్వబోతనట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఓటిటి డీల్ రద్దు అయినట్లు సమాచారం. దీనికి కారణం నెట్‌ఫ్లిక్స్ మరియు నిర్మాణ సంస్థ మధ్య వివాదమే అని తెలుస్తోంది.
థియేటర్లో ఈ సినిమా అనుకుంతా స్థాయిలో ఆకట్టుకోవడంలో విఫలమైంది, తంగలాన్ ఓటిటి హక్కులు అంగీకరించిన మొత్తం కంటే తక్కువ ఇవ్వాలని నిర్మాణ సంస్థను నెట్‌ఫ్లిక్స్ డిమాండ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అందుకు నిర్మాతలు ఒప్పుకోలేదని అంటున్నారు. ఈ సినిమా ఓటిటి డీల్‌ను నెట్‌ఫ్లిక్స్ రద్దు చేసిందని కోలీవుడ్ సర్కిల్స్‌లో కథనాలు ఉన్నాయి. ఓటిటి విడుదల విషయంలో నెట్‌ఫ్లిక్స్ వెనక్కి తగ్గడంతో మేకర్స్ మరో ఓటిటిలో తంగలాన్ మూవీని విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. నవంబర్‌లో ఈ సినిమా ఓటిటి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.