Homeహైదరాబాద్latest Newsకేటీఆర్ పై క్రిమినల్ కేసు నమోదు.. కారణం ఏంటంటే..?

కేటీఆర్ పై క్రిమినల్ కేసు నమోదు.. కారణం ఏంటంటే..?

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అధికార కాంగ్రెస్ కు ప్రతిపక్ష బీఆర్ఎస్ కు మధ్య ప్రచ్చన్న యుద్ధం కొనసాగుతుంది. ఇదే క్రమంలో తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదయ్యింది. కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి పై తాజాగా చేసిన వ్యాఖ్యలతో హనుమకొండ పోలీసులకు బత్తిని శ్రీనివాసరావు అనే కాంగ్రెస్ నేత ఫిర్యాదు చేయడంతో కేటీఆర్ పై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి 2500 కోట్ల రూపాయల వసూలు చేశారని, కాంగ్రెస్ పెద్దలకు పంపించారని తాజాగా కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు.

తెలంగాణ భవన్లో జరిగిన సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సామంత రాజులాగా రేవంత్ రెడ్డి 2500 కోట్ల రూపాయలు వసూలు చేసి ఢిల్లీకి కప్పం కట్టారని ఆరోపించారు. దీనికోసం రేవంత్ రెడ్డి అందరిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు కేటీఆర్. ఇక ఈ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకుంటున్న కాంగ్రెస్ నేతలు కేటీఆర్ పైన మండిపడుతున్నారు. బత్తిని శ్రీనివాసరావు అనే కాంగ్రెస్ నేత హనుమకొండ పోలీసులకు కేటీఆర్ పై ఫిర్యాదు చేశారు. తెలంగాణ సీఎం పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేటీఆర్ పై క్రిమినల్ కేసు నమోదు చేసిన హన్మకొండ పోలీసులు కేసును బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. దీంతో కేటీఆర్ పై బంజారాహిల్స్ పోలీసులు IPC సెక్షన్ 504, 502 (2) సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు.

Recent

- Advertisment -spot_img