Homeహైదరాబాద్latest Newsఇకపై TG పేరుతో వాహనాల రిజిస్ట్రేషన్లు : Ponnam Prabhakar

ఇకపై TG పేరుతో వాహనాల రిజిస్ట్రేషన్లు : Ponnam Prabhakar

– నేటి నుంచే అమలు
– వెల్లడించిన మంత్రి పొన్నం ప్రభాకర్

ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: ప్రజల మనోభావాల మేరకు తెలంగాణ వాహనాల రిజిస్ట్రేషన్‌ ప్లేట్లపై టీఎస్‌ను టీజీగా మారుస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ వెల్లడించారు. నేటి నుంచి వాహనాల రిజిస్ట్రేషన్లు అన్నీ ఇకపై టీజీగా వస్తాయని ప్రకటించారు. గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘కేసీఆర్‌ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలు, మనోభావాలను అణచివేసింది. తెలంగాణ ఉద్యమ సమయంలో అందరం టీజీ అని రాసుకున్నాం. అసెంబ్లీ ఆమోదంతో టీఎస్‌ను టీజీగా మార్చాలని కేంద్రానికి పంపించాం. అందుకు ఆమోదం లభించింది. గత ప్రభుత్వం మాదిరిగా.. జీవోలను రహస్యంగా ఉంచాలనుకోవడం లేదు’ అని పొన్నం స్పష్టం చేశారు.

Recent

- Advertisment -spot_img