Homeఫ్లాష్ ఫ్లాష్Rekhanayak resigns from బీఆర్ఎస్ BRS కు రేఖానాయక్​ రాజీనామా

Rekhanayak resigns from బీఆర్ఎస్ BRS కు రేఖానాయక్​ రాజీనామా

– మహిళలకు భారత రాష్ట్రసమితిలో గౌరవం లేదని ఆరోపణల
– త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరే చాన్స్​

ఇదేనిజం, హైదరాబాద్​: ఖానాపూర్​ ఎమ్మెల్యే రేఖానాయక్​ బీఆర్ఎస్​ పార్టీకి రాజీనామా చేశారు. మహిళలకు బీఆర్ఎస్​ పార్టీలో గౌరవం లేదని అందుకే పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. ఖానాపూర్​ టికెట్​ రాకపోవడంతో రేఖానాయక్​ చాలా రోజులుగా అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఇవాళ ఆమె అధికారికంగా పార్టీకి రాజీనామా సమర్పించారు. ఏ పార్టీ నుంచి బరిలోకి దిగుతానన్న విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తానన్నారు. ఆమె భర్త శ్యామ్‌ నాయక్‌ ఇటీవల కాంగ్రెస్‌లో చేరారు. ఈ నేపథ్యంలో ఆమె కూడా కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బీఆర్ఎస్​ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల మొదటి జాబితాలో రేఖా నాయక్‌ పేరు లేకపోవడంతో ఆమె అసంతృప్తికి గురైన సంగతి తెలిసిందే.

Recent

- Advertisment -spot_img