నందమూరి నట సింహం బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్’ రియాల్టీ షోను విజయవంతంగా హోస్ట్ చేస్తున్నారు. అల్లుఅర్జున్ ‘పుష్ప 2’ మూవీ త్వరలో విడుదల కానుంది. అయితే ఈ ఎపిసోడ్ మొదటి భాగం ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతుండగా… తాజాగా రెండో ఎపిసోడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రెండో ఎపిసోడ్ లో అల్లుఅర్జున్ కొడుకు అల్లుఅయాన్, కూతురు అర్హ సందడి చేశారు. అలాగే ఇదే షోలో మెగాస్టార్ చిరంజీవిపై తనకున్న ప్రేమను బన్నీ వెల్లడించాడు. మెగాస్టార్ చిరంజీవితో నాకు చిన్నప్పటి నుంచి ఎలాంటి అనుబంధం ఉండేదో అందరికీ తెలిసిందే. ఆయనంటే నాకు చాలా ఇష్టం. 20 ఏళ్ల తర్వాత నేను ఆయనతో ఎలా ఉన్నానో తెలుసు.. కానీ 20 ఏళ్ల ముందు చిరంజీవిగారితో ఎలా ఉన్నానో ఎవరికీ తెలియదు. చిన్నప్పటి నుంచి నేను చిరంజీవి గారిని చూస్తూ పెరిగాను. హీరోగా కంటే ఒక వ్యక్తిగా నాకు చాలా ఇష్టం. నా చిన్నప్పుడు మనందరినీ విదేశాలకు తీసుకెళ్లిన మొదటి వ్యక్తి చిరంజీవి. కావాలంటే వాళ్ల ఫ్యామిలీతో పాటు వెళ్లొచ్చు. కానీ వాళ్ళు మమ్మల్ని అందరిని తీసుకెళ్లారు.ఆ రోజుల్లో అంతమంది పిల్లలను తీసుకెళ్లడం అసాధ్యం. అలాంటిది మమ్మల్ని చిరంజీవి గారు అలా తీసుకెళ్ళారు.. నేను చిన్నప్పుడు చిరంజీవి గారిని చిక్ బాబాయ్ అని పిలుస్తాను.. మా తాతయ్య రామలింగయ్య గారికి ఆయన చాలా గౌరవమిస్తారు. ఒక్కోసారి మా నాన్న కూడ ఇవ్వనంత గౌరవం ఇస్తారు ‘ అంటూ అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అల్లుఅర్జున్ చిరంజీవి గురించి గొప్పగా మాట్లాడిన వీడియోను అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.