Homeఅంతర్జాతీయంrelax:ప‌చ్చ‌ని చెట్లతో మాన‌సిక ఆరోగ్యం

relax:ప‌చ్చ‌ని చెట్లతో మాన‌సిక ఆరోగ్యం

relax:ప‌చ్చ‌ని చెట్లతో ప‌రుచుకున్న ప్ర‌దేశాలు, గ్రీన్ స్పేస్‌తో ఆయు:ప్ర‌మాణం పెర‌గ‌డం, మాన‌సిక ఆరోగ్యం మెరుగ‌వ‌డం వంటి ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు చేకూరుతాయ‌ని అంద‌రికీ తెలిసినా మెరుగైన ప్ర‌జారోగ్యం కోసం ఎంత గ్రీన్ స్పేస్ ఉండాల‌నే దానిపై స్ప‌ష్ట‌త లేదు. ఐఎస్‌గ్లోబ‌ల్ చేప‌ట్టిన తాజా అధ్య‌య‌నం ఆస‌క్తిక‌ర అంశాల‌ను వెల్ల‌డించింది.

దీనికోసం 3-30-300 గ్రీన్ స్పేస్ రూల్‌ను పాటించాల‌ని ఈ స్ట‌డీ స్ప‌ష్టం చేసింది. ప్ర‌తి ఒక్క‌రూ త‌మ ఇంటి నుంచి క‌నీసం మూడు చెట్ల‌ను చూడాల‌ని, వారు నివ‌సించే ప్ర‌దేశంలో 30 శాతం చెట్లు నిండిఉండాల‌ని, స‌మీప పార్క్ లేదా గ్రీన్ స్పేస్‌కు 300 మీట‌ర్ల లోపే నివాసం ఉండాల‌ని పేర్కొంది.

అర్బ‌న్ ఫారెస్ట‌ర్ సెసిల్ కొనిందెజిక్ ఈ నిబంధ‌న‌ను ముందుకు తీసుకురాగా, ఇత‌ర ఫారెస్ట‌ర్స్‌, అర్బ‌న్ ప్లాన‌ర్లు ఈ నిబంధ‌న‌ను అనుస‌రిస్తున్నారు. 3-30-300 రూల్‌ను విధిగా పాటించ‌డానికి, మెరుగైన మాన‌సిక ప్ర‌యోజ‌నాలు చేకూరేందుకు సంబంధం ఉంద‌ని వెల్ల‌డైంది. ఈ నియ‌మాన్ని అనుస‌రిస్తే మందులు వేసుకోవ‌డం, సైకాల‌జిస్టును త‌ర‌చూ క‌ల‌వ‌డం నుంచి ఊర‌ట ల‌భిస్తుంద‌ని తేలింది.

Recent

- Advertisment -spot_img