Homeతెలంగాణరైతుభీమా కోసం రూ.1173.54 కోట్లు విడుదల

రైతుభీమా కోసం రూ.1173.54 కోట్లు విడుదల

హైదరాబాద్​ : రైతుభీమా పథకం కొనసాగిస్తూ నిధులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్​కు రైతుల పక్షాన ధన్యవాదాలు తెలిపారు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. రైతుభీమా కోసం రూ.1173.54 కోట్ల రూపాయలు విడుదల చేసింది ప్రభుత్వం. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రీమియం నిధులు విడుదల చేసింది ప్రభుత్వం. 18 శాతం జీఎస్టీతో కలిపి రూ.1141 కోట్ల ప్రీమియం, రూ.32.54 కోట్ల స్టాంప్ డ్యూటీ నిధులు సైతం విడుదల అయ్యాయి. ఈ ఆగస్టు 14 నుంచి ఆగస్టు 13, 2021 వరకు ఈ భీమా వర్తింపు అవుతుంది. దీనికి సంబందించి ఎల్ఐసీకి చెల్లించేందుకు ఉత్తర్వులు జారీచేసింది రాష్ట్ర ప్రభుత్వం.

 18 నుండి 59 సవంత్సరాల వయసుగల 32.73 లక్షల మంది రైతులు భీమా పరిధిలోకి వస్తారు. ఈ ఏడాదితో 59 ఏండ్లు నిండిన రైతులు అనర్హులవుతుండగా, 18 ఏండ్లు నిండిన, కొత్తగా నమోదు చేసుకున్న దాదాపు రెండు లక్షల మంది రైతులు నూతనంగా రైతుభీమా పథకం పరిధిలోకి వస్తారు. కరోనా క్లిష్ట పరిస్థితులలోనూ రైతుభీమా పథకం కొనసాగిస్తూ నిధులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్​కు రైతుల పక్షాన ధన్యవాదాలు తెలిపారు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి.

 2018 ఆగస్టు 14న ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుభీమా పథకం ప్రారంభించారు. గత రెండేళ్లలో ఎల్ఐసీకి రైతుభీమా పథకం కోసం ప్రీమియం కింద రూ. 1775.95 కోట్లు చెల్లింపు, గత రెండేళ్లలో ఇప్పటి వరకు 32,267 మంది రైతు కుటుంబాలకు రైతుభీమా వర్తింపు, ఎల్ఐసీ ద్వారా ఒక్కో రైతు కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున రూ.1613.35 కోట్లు చెల్లింపు, ఈ నెల ఆగస్టు 13 వరకు గత ఏడాది చెల్లించిన ప్రీమియం వర్తిస్తుంది. ఎల్ఐసీ వద్ద పరిశీలనలో ఉన్న 1800 మంది రైతుల భీమా క్లైములు. దీనికింద చెల్లించాల్సిన నిధులు రూ.90 కోట్లు. ప్రపంచంలో ఎక్కడా రైతుభీమా లాంటి పథకం లేదని మంత్రి అన్నారు. ఎక్కడా మద్యవర్తి, పైరవీకారు లేకుండా కేసీఆర్ రూపొందించిన అద్భుతమైన పథకం అన్నారు మంత్రి.

 రైతు ఏ కారణం చేత చనిపోయినా అయిదారురోజలలో రైతు కుటుంబానికి చెందిన ఖాతాలో రూ.5 లక్షలు జమ అవుతుంది ఈ పథకం ప్రకారం. అన్ని ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు చేరేలా చేయడం ముఖ్యమంత్రి కేసీఆర్ సూక్ష్మదృష్టికి నిదర్శనం. అంచలంచెలుగా వ్యవస్థలలో లంచాలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు కేసీఆర్. ఎవరు ఏం మాట్లాడినా రైతులు, పేదలు, సామాన్యులకు న్యాయం చేయడంపైనే నిరంతరం దృష్టి ఉందన్నారు మంత్రి నిరంజన్​ రెడ్డి.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img