Homeహైదరాబాద్latest Newsసుప్రీంకోర్టులో ఎంపీ నవనీత్‌కౌర్‌కు ఊరట

సుప్రీంకోర్టులో ఎంపీ నవనీత్‌కౌర్‌కు ఊరట

Delhi : అమరావతి ఎంపీ నవనీత్‌కౌర్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. నవనీత్ కౌర్ క్యాస్ట్ సర్టిఫికేట్ చెల్లదంటూ గతంలో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తాజాగా రద్దు చేసింది. తప్పుడు పత్రాలతో కులధ్రువీకరణ పత్రం తీసుకున్నారని రూ. 2 లక్షల జరిమానా విధించింది బాంబే హైకోర్టు. దీనిపై సుప్రీంకోర్టును అశ్రయించగా హైకోర్టు తీర్పును రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 2019 లో ఎన్‌సీపీ మద్దతుతో అమరావతి ఎంపీగా నవనీత్ కౌర్ గెలిచారు. ఇటీవలే భాజపాలో చేరి అమరావతి నుంచి పోటీ చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img