”పుష్ప 2” మూవీ సందర్భంగా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో సినిమా నిర్మాతలకు హైకోర్టులో ఊరట లభించింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలైన రవిశంకర్, నవీన్‌ను అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశించింది. నిర్మాతలపై కేసు నమోదు చేసిన పోలీసులు.. పోలీసులు ఫైల్ చేసిన కేసును కొట్టివేయాలని నిర్మాతలు హైకోర్టులో క్వాష్ పిటీషన్ దాఖలు చేసారు. తదుపరి విచారణ కొరకు కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు నోటీసులు జారీ చేసింది. దీంతో విచారణ రెండు వారాలకు వాయిదా పడింది.