తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో శుక్రవారం ఊరట లభించింది. ఓటుకు నోటు కేసు విచారణను తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్ కు మార్చాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసును మరో రాష్ట్రానికి మార్చేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది. అయితే కేసు విచారణ వివరాలను సీఎం రేవంత్ కు నివేదించవద్దని ఏసీబీకి సుప్రీంకోర్టు సూచించింది.