బాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఓ ఇంటర్వ్యూలో తాను బాలీవుడ్ నుంచి వెళ్లిపోతాను అంటూ బాంబు పేల్చాడు. అనురాగ్ కశ్యప్ మాట్లాడుతూ.. నేను ఇప్పుడు ప్రయోగాలు చేయలేను. ఇప్పుడు నిర్మాతలు లాభాల కోసమే చూస్తున్నారు. అందుకే వచ్చే ఏడాది ముంబై వదిలి సౌత్ వెళ్లాలనుకుంటున్నాను. ఎక్కడైతే స్పూర్తిదాయకమైన పని ఉంటుందో అక్కడికి వెళ్తాను వెళ్తాను లేదంటే ముసలివాడిలా చనిపోతాను. ఈ బాలీవుడ్ నన్ను చాలా నిరుత్సాహపరుస్తుంది అని పేర్కొన్నారు. కొంతమంది నటీనటులు యాక్టింగ్ కంటే స్టార్స్ కావాలనే ఆసక్తిని చూపుతారని అనురాగ్ కశ్యప్ అన్నారు. దీంతో ఈ దర్శకుడు చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.