Homeహైదరాబాద్latest News''నేను రాజకీయాల్లోకి..'' అంటూ రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు..!

”నేను రాజకీయాల్లోకి..” అంటూ రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు..!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు… రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చేసిన పలు పోస్టులు, వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఇటీవలే రేణు దేశాయ్ ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. విజయవాడలో భారత్ చైతన్య యూత్ పార్టీ ఆధ్వర్యంలో సామాజిక కార్యకర్త సావిత్రి బాయ్ ఫూలే జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రేణు దేశాయ్ మాట్లాడుతూ.. సావిత్రీబాయి ఫూలే మహిళా విద్య కోసం ఎంతో కృషి చేశారని, సావిత్రిబాయి ఫూలే జయంతి కార్యక్రమం కావడంతో ఈ కార్యక్రమానికి హాజరుకావడం సంతోషంగా ఉందని, అలాగే ”నేను రాజకీయాలకు దూరం. నాకు రాజకీయాల పట్ల ఆసక్తి లేదు. తల్లిదండ్రుల కంటే కుండా పిల్లలు బాల్యంలో ఉపాధ్యాయులతోనే ఎక్కువగా ఉంటారు. కాబట్టి వారిని గొప్ప పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే అన్నారు”. రేణు దేశాయ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటుడు బ్రహ్మానందం కూడా పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img