Homeహైదరాబాద్latest Newsరాజ్యసభకు Renuka Chaudhary, Anil Kumar Yadav

రాజ్యసభకు Renuka Chaudhary, Anil Kumar Yadav

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్​ పార్టీ తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యులను ఖరారు చేసింది. రేణుకా చౌదరి, అనిల్​ కుమార్​ యాదవ్​ కు రాజ్యసభ సభ్యులుగా అవకాశం దక్కనున్నది. రాష్ట్రం నుంచి ఇద్దరిని రాజ్యసభకు పంపించే చాన్స్​ ఉంది. దీంతో రాష్ట్రం తరఫున సోనియా గాంధీని పంపించాలని తెలంగాణ కాంగ్రెస్​ నేతలు భావించారు. ఇందుకోసం గతంలో సోనియాను కలిసి విజ్ఞప్తి చేశారు. కాగా తాజాగా రేణుకా చౌదరి, అనిల్​ కుమార్​ యాదవ్​ పేర్లు తెరమీదకు వచ్చాయి. వీరిలో రేణుకా చౌదరి ఖమ్మం టికెట్​ ఆశిస్తుండగా.. అనిల్​ కుమార్​ యాదవ్​ సికింద్రబాద్​ నుంచి బరిలో దిగాలని చూస్తున్నారు. అంతేకాక ఖమ్మం సీటు నుంచి పోటీ చేయాలని చాలా మంది లీడర్లు ప్రయత్నిస్తున్నారు. తాజాగా రేణుకా తప్పుకుంటే ఈ సీటు విషయంలో కొంత పీటముడి వీడనున్నది.

Recent

- Advertisment -spot_img