Homeహైదరాబాద్latest NewsRepublic Day: ఘనంగా గణతంత్ర వేడుకలు.. జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి..!

Republic Day: ఘనంగా గణతంత్ర వేడుకలు.. జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి..!

Republic Day: దేశ వ్యాప్తంగా ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఏ సందర్భంగా ఢిల్లీలోని కర్తవ్యపథ్ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. సైనిక బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. త్రివిధ దళాలు సంయుక్తంగా ఒక శకటాన్ని తీసుకురావడం ఈసారి ప్రత్యేకంగా నిలిచింది. వేడుకల్లో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాం, ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్జఖడ్, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ‘స్వర్ణిమ్ భారత్, విరాసత్ ఔర్ వికాస్’ అనే థీమ్ తో శకటాలను రూపకల్పన చేయడం విశేషం. సైనిక సామర్థ్యాలను ప్రదర్శించే బ్రహ్మోస్, ఆకాశ్ క్షిపణులు, పినాక మల్టీబ్యారెల్ రాకెట్‌లు పెరేడ్ లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కర్తవ్య పథ్‌పై హెలికాప్టర్లు పూల వర్షం కురిపించాయి. రిపబ్లిక్ డే పరేడ్ 9 కిలోమీటర్ల మేర రాష్ట్రపతి భవన్ నుంచి ఎర్రకోట వరకు కొనసాగింది. ఈ పరేడ్‌లో 31 శకటాలు ప్రదర్శించబడ్డాయి.

Recent

- Advertisment -spot_img