ఇదేనిజం, వెబ్‌డెస్క్ : మిత్రమా..! ప్రచారం ముగిసింది. మిగిలింది పోలింగే. తొందరపడొద్దు. గాబరా కావద్దు. ఆలోచించు. నలుగురితో మాట్లాడు. Know the Truth. విశ్లేషించి ఓ అంచనాకు రా. గట్టిగా అనుకో. Decide అయిపో. Money ఇచ్చారని కాదు. మనోడు అని చూడకు. ఎవరో చెప్పారని వినకు. ఏం అనుకుంటారో అని ఆలోచించకు. ఇంట్లోవాళ్ల మాట అసలే వినకు. ఇది కంప్లీట్‌గా నీ Decision. రేపు ఏం జరిగినా మాట్లాడే హక్కు నీకుంటుంది. మంచైనా, చెడైనా నీది Key Role . Question చేసే అధికారం కావాలంటే..నీకు నచ్చినవారికి ఓటెయ్. నచ్చకపోతే నోటాకు వెయ్. అంతేకానీ ఎవరికీ లొంగకు. ఎవరికి ఓటు వేసావో కూడా చెప్పాల్సిన అవసరం లేదు. సీక్రెట్‌గా ఉంచు. ఇంట్లో ఉండకు. Festival Every Year ఒస్తుంది. కానీ Elections ఐదేళ్లకోసారి. గుర్తుపెట్టుకో. All the Best.