Homeజిల్లా వార్తలుప్రాణాంతరకరమైన కోనో కార్పస్ చెట్టులను తొలగించాలని మునిసిపల్ కమిషనర్ కు వినతి

ప్రాణాంతరకరమైన కోనో కార్పస్ చెట్టులను తొలగించాలని మునిసిపల్ కమిషనర్ కు వినతి

దే నిజం దేవరకొండ: దేవరకొండ పట్టణంలో వున్న కోనో కార్పస్ ప్రాణాంతరకరమైనవి కావడం వలన వెంటనే తొలగించాలని మున్సిపల్ కమిషనర్ దేవరకొండ వారికి వినతి పత్రం అందజేయడం అయినది. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి సామాజికవేత్త డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ…కోనో కార్పస్ చెట్లు రోడ్డు మధ్యలో డివైడర్ లలో జనావాసం ఉన్నటువంటి కాలనీ ప్రాంతాలలో ఇతర ప్రాంతాలలో కూడా రోడ్ల పక్కన ఈ మొక్కలు ఉండడం వలన అవి విడుదల చేసినటువంటి విష పదార్థాలు మానవాళికి వైద్యశాస్త్ర పరిశోధనలో ఉదర మరియు శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వస్తాయని తెలియపరిచినారు. పక్షులకు కూడా జీవ మనగడే అంతమయ్యేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. భూగర్భ జలాలు కూడా అడుగంటే పరిస్థితి ఏర్పడుతుంది. మొత్తం జీవ యావత్తుకే ప్రమాదం ఏర్పడేంత పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని రాష్ట్రాల్లో పూర్తిగా ఈ మొక్కలను తొలగించినారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రాణానికి హాని కలిగించేటటువంటి మొక్కలను తొలగించాలని మున్సిపల్ కమిషన్ ను కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి చోల్లోటి భాస్కరాచారి, బీసీ సంక్షేమ సంఘం నాయకులు అంకం చంద్రమౌళి, కౌన్సిలర్ గాజుల మురళి, కౌన్సిలర్ జయప్రకాష్, రాసమల్ల నాగయ్య ముదిరాజ్, కూరెళ్ళ కృష్ణ చారి, చేరుపల్లి జయలక్ష్మి, ముసిని సత్యం, గౌరోజు బ్రహ్మచారి,వనం శ్రీను,ఇరగ దిండ్ల కృష్ణ, సయ్యద్ అజ్మతుల్ల,కూరెళ్ళ రామకృష్ణ చారి, మోతిలాల్, దేవకమ్మ, రాజేశ్వరి, అనిత, మానస, రామకృష్ణ, తోటపల్లి శ్రీనివాసులు, వనం స్రవంతి, వెంకటాచారి, దామోదర్, జంపాల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img