ఇదే నిజం, ధర్మపురి టౌన్: శాసనసభలో సమగ్ర కులగణన తీర్మానం శుక్రవారం ఏకగ్రీవంగా ఆమోదం పొందడంతో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు, న్యాయవాది జాజాల రమేష్ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లురి లక్ష్మణ్ కుమార్, చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీ సంఘాల తరఫున ధన్యవాదాలు తెలుపడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుడుమల్ల శేఖర్, పొరండ్ల శివకుమార్, పోలస శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.