Homeహైదరాబాద్latest Newsపట్టణంలో రోడ్ల సమస్యలు తీర్చండి.. కమిషనర్ కు యూత్ నాయకుడు సూరం చంద్రమౌళి వినతి పత్రం

పట్టణంలో రోడ్ల సమస్యలు తీర్చండి.. కమిషనర్ కు యూత్ నాయకుడు సూరం చంద్రమౌళి వినతి పత్రం

ఇదేనిజం, లక్షెట్టిపేట: పట్టణంలో రోడ్ల సమస్యను తీర్చాలని యూత్ నాయకుడు సూరం చంద్రమౌళి కమిషనర్ ను కోరారు. బుధవారం యూత్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీ పరిధిలోని 11 వార్డ్ లొ వర్షం కారణంగా పలు చోట్ల డ్రైనేజీ,గుంతల్లో నీరు నిల్వ ఉండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. చాలా చోట్ల డ్రైనేజీ సదుపాయం లేక డ్రైనేజీ నీరు రోడ్డు పైన చేరుతుందన్నారు. ప్రజలు డెంగీ, మలేరియా బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలపై కమీషనర్ దృష్టి సారించాలన్నారు. గత నాలుగు రోజులు గా కురుస్తున్న వర్షాల కారణంగా పట్టణంలోని పలు విదుల్లో రోడ్లు బురద మయంగా తయారై నడవటానికి ఇబ్బంది కరంగ మారిందన్నారు. డ్రైనీజీలు నిండి రోడ్లపై మురికి నీళ్ళు పారతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పలు సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలనీ చైర్మన్, కమిషనర్ వివరించారు. సమస్యలను తొందరగా పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పోతురాజుల శ్రీనివాస్, గెల్లు తిరుపతి ఐల్ల రాజన్న, నస్పూరి సత్తన్న, పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img