పాకాల ఆయకట్టు కాలువల పుణర్నిర్మాణం & గిరిజన రెసిడెన్సియల్ పాఠశాల ఏర్పాటును కోరిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ..
ముఖ్యమంత్రి కేసీఆర్కు వినతి పత్రం అందజేసిన ఎమ్మెల్యే.. సానుకూలంగా స్పందించి పరిష్కారానికి హామీ ఇచ్చి, అదికారులకు ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్
పాకాల ఆయకట్టుకు నీళ్ళివ్వడం కోసం గతంలో తీసిన కాలువలు ద్వసం అయ్యాయని, గతంలో సమైక్య పాలకులు అనాలోచితంగా వాటిని నిర్మించడంతో అవి ద్వంసమై పోయాయని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. కాకతీయుల వారసత్వ సంపద అయిన పాకాలలో నాడు కాకతీయులు అద్బుతమైన సాంకేతికతతో కాలువలు తవ్వడం జరిగిందని, నేడు అవి ద్వంసమై పోయాయని వాటిని పునరుద్దరించాలని సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కోరారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ పూర్తి అయ్యిందని, కొద్ది రోజుల్లో నీళ్ళు రానున్నాయని, ఈ సమయంలో కాలువలు పూర్తిగా నిర్వీర్యం అవడంతో నీటిని పొలాలకు తరలించేందుకు ఇబ్బందులు ఎదురౌతాయని, శాశ్వత ప్రాతిపాదికన కాలువల పుణర్నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రికు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వినతిపత్రం అందజేసారు.
నర్సంపేట నియోజకవర్గంలో ఎస్టీ జనాబా ఎక్కువగా ఉందని దానికి అనుకూలంగా గతంలో ఎస్టీ రిజర్వడ్ నియోజకవర్గాల్లో ఎస్టీ రెసిడెన్సియల్ పాఠశాలను ఏర్పాటు చేశారని, నర్సంపేట నియోజకవర్గం జనరల్ కావడంతో ఇక్కడ ఏర్పాటు చేయలేదని, దీంతో గిరిజనుల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని ఎస్టీ రెసిడెన్సియల్ (బాలుర/బాలికల) పాఠశాలను ఏర్పాటు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి వినతి పత్రాన్ని అందజేసారు. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించి వాటిని ఏర్పాటు చేస్తామని హామీతో పాటు సంబందిత అదికారులకు తగు ఆదేశాలు జారీ చేసారు. పాకాలా ఆయకట్టు సాగునిటీ కాలువల సమస్యపై ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, జలవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రజత్ కుమార్లకు ఆదేశాలు జారీ చేసారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి దన్యవాదాలు తెలిపారు..