Retro Trailer : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూర్య ”రెట్రో” అనే సినిమాలో నటించాడు.ఈ రొమాంటిక్ యాక్షన్ ఫిల్మ్‌లో సూర్య సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను చిత్రబృందం రిలీజ్ చేసింది. ఈ సినిమా ట్రైలర్ ప్రేమ, యాక్షన్, మరియు వినోద అంశాలతో నిండి ఉంది, సూర్య శక్తిమంతమైన కొత్త పాత్రలో కనిపిస్తున్నారు. ఈ సినిమాకి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు, మరియు 2డీ ఎంటర్‌టైన్‌మెంట్, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించాయి. డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కూడా మంచి సినిమాలు తీస్తాడు అనే పేరు ఉంది. గత ఏడాది విడుదలైన ”జిగర్ తండ డబుల్ ఎక్స్” సినిమా హిట్టు కాగా, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ క్రమంలో వీరిద్దరి కలయకలో వస్తున్న ‘రెట్రో’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా మే 1న ధియేటర్లో రిలీజ్ కానుంది.