సీఎం రేవంత్ చంద్రబాబుకు అభినందనలు తెలిపారు. ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పినట్లు సమాచారం. ఎన్నికల్లో అఖండ విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి. తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగిద్దామని రేవంత్ రెడ్డి అన్నారు. విభజన హామీలు, సమస్యలను సామరస్యంగా చర్చించుకొని పరిష్కరించుకుందామని వ్యాఖ్యానించారు. కాగా ఇద్దరూ సన్నిహితులే కదా..రిజల్ట్స్ వచ్చిన రెండు రోజులకు విషెస్ ఏంటంటూ పలువురు మాట్లాడుకుంటున్నారు. అదేరోజు కాల్ చేసి విషెస్ చెప్పొచ్చు కదా అని చర్చించుకుంటున్నారు.